Wed. Jan 8th, 2025

సైరా ‘నరసింహారెడ్డి’ గెటప్ లో అదరగొడుతున్న ఈ బుడతడెవరు?

అభిమాన హీరోల మేనరిజమ్స్ ఫాలోకావటమంటే.. ఫ్యాన్స్ కు యమా సరదా. తమ అభిమాన హీరో కొత్తగా ఏది ట్రై చేసినా, దాన్ని ఫాలో అయిపోతుంటారు. ఇక తమ ముందు సూపర్ హీరోస్ వస్తే… చిన్నపిల్లలు ఆ కేరక్టర్స్ లో లీనమైపోయి యా హూ హా అంటూ ఫైట్స్ చేసేస్తుంటారు. ఇక టాలీవుడ్ లో మెగా స్టార్ కున్న కటౌట్ ఏంటో అర్థం కాదుగానీ.. ఆ కటౌట్ చూడగానే పిల్లలు, పెద్దలు, యూత్ ఎవరైనా సరే రఫ్పాడించేస్తారు. అదీ మెగా స్టార్ క్రేజ్. ఈ క్రేజీ హీరో తాజాగా సైరా నరసింహా రెడ్డిలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే తరహాలో ‘సైరా నరసింహా రెడ్డి’లో చిరంజీవి గెటప్ చూసి ముచ్చటపడ్డ ఓ చిన్నారి.. ఆ కాస్ట్యూమ్స్‌ లో భలే పోజులిచ్చాడు. మామూలుగా అయితే సినిమా రిలీజ్ కు రెడీ అయ్యాక కాస్ట్యూమ్స్ సందడి చేస్తుంటాయి. కానీ షూటింగ్ టైమ్ లోనే ఓ కొత్త కేరక్టర్ ను ఓ చిన్న పిల్లాడు ఆకళింపు చేసేసుకున్నాడు. చేతిలో కత్తితో.. ‘సైరా నరసింహారెడ్డి’ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోతున్న ఓ బుడ్డోడి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఎవరా ఈ చిట్టి తండ్రి? అని చాలామంది ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఈ బుడ్డోడు ఎవరి కుమారుడో తెలుసా?.. సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి కుమారుడు.

READ MORE:  Why 'Dussehra' Is Time To Introspect Indians?

సైరా షూటింగ్ సెట్‌లో చిరంజీవిని ఆ గెటప్‌లో చూసి.. తనకూ అలాంటి కాస్ట్యూమ్స్ కావాలని తన తండ్రి సురేందర్ రెడ్డిని అడిగాడట ఈ బుడ్డోడు. ముద్దులొలికే మాటలతో కొడుకు తన కోరిక గురించి చెప్పేసరికి.. కాదనలేక సురేందర్ రెడ్డి కూడా ‘సై’ అన్నాడట. తండ్రి ఆ కాస్ట్యూమ్స్ తెప్పించడమే ఆలస్యం.. చేతిలో కత్తితో ఈ చిన్ని ‘నరసింహారెడ్డి’ హల్‌చల్ చేశాడు. ఫోటోలకు భలే పోజులిచ్చాడు. ఆ ఫోటోల్లో బుడ్డోడు ఇచ్చిన ఎక్స్‌ ప్రెషన్‌కు ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు నెటిజెన్స్.

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సైరా తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఫిబ్రవరి నుంచి రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. #KhabarLive

READ MORE:  Age-Old Shrine Devuni Gutta: A Researcher’s Paradise In Telangana

About The Author

Related Post

Copy link